భారీ వర్షాలకు ..ఈదురు గాలులకు నేలకొరిగిన వరి పంట
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దానికి తోడు ఈదురు గాలులు తోడు కావడంతో వరి పంట నేలకొరిగింది. మండల పరిధిలోని నాగర కన్వి గ్రామ పరిధిలో రెండు రోజుల క్రింద కురిసిన వర్షాలకు కంకిపై ఉన్న వరి పంట నీటితో బరువెక్కి ఈదురు గాలులకు ఒరిగిపోయి నేలకు కరుచుకుంది. ప్రారంభంలో నాటు వేయడానికి నీరు లేక ఇబ్బందులు పడ్డ రైతన్నలు కష్టపడుతూ పంటను కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ప్రకృతి పగ పట్టినట్లుగా గత మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి ఎరువులు పురుగుమం దులతో రోగాలు లేకుండా ఏపుగా పెరిగిన వరి పైరు కంకితో కలకలలాడుతోంది. అయితే కురుస్తున్న వర్షాలకు నీటితో నానిన కంకులు పైరు బరువెక్కడంతో శనివారం వీచిన ఈదురు గాలులకు పొలంలో నీటిపై వాలిపోయి నేలకు ఖర్చుకు పోయింది. ఈ విధంగా నేలకు కరుచుకున్న వరి పంట నీళ్లలో నాని కంకులకు, మొలక వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.