అలగనూరు రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్..
1 min read34 కోట్లతో మరమ్మతులకు నిధులు
అలగనూరు రిజర్వాయర్ కు వచ్చిన మోక్షం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు జలాశయ రిజర్వాయర్ ప్రాజెక్టును నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గురువారం ఉ 11 గం.కు పరిశీలించారు.ఈ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వీటి మరమ్మతులకు గాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 మీటర్ల పొడవున కట్ట నిర్మాణానికి 34 కోట్ల నిధులు మరమ్మతులకు ప్రభుత్వం ఆమోదించింది.వీటి నివేదికను పంపాలని ప్రభుత్వం కేసీ కాల్వ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.మూడు ఏళ్లుగా నీళ్లు నిల్వ చేయకపోవడంతో ఒట్టిపోయిన అలగనూరు జలాశయాన్ని ప్రాధాన్యతా జాబితాలో చేర్చింది.కట్ట కుంగిన ప్రాంతాల్లో మరమ్మతుల పనులు చేసేందుకు 34 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.కొత్త బండ్ నిర్మాణం చేయాల్సి ఉందని నివేదించారు.పనులు వేగంగా పూర్తి చేస్తే కేసీ కాల్వ పరిధిలో వెయ్యి ఎకరాల ఆయకట్టును స్టిరీ కరించొచ్చు.పలు గ్రామాలకు మంచినీరు 200 మత్స్య కారుల కుటుంబాల జీవితాలు మెరుగు పడతాయని చెప్పవచ్చు. రిజర్వాయర్ ప్రాజెక్టు నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి పంపనున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు మిడుతూరు తహసిల్దార్ శ్రీనివాసులు,గడివేముల తహసిల్దార్ అధికారులు పాల్గొన్నారు.