PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లా డీఈవోగా ఎస్ శ్యామ్యూల్ పాల్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అంకితభావం, క్రమశిక్షణ కలిగి విధులు నిర్వహిస్తే ఎంతటి వారైనా ఉన్నత స్థానం లోకి వెళతారనేందుకు నిదర్శనం ఈ కథనం. కర్నూలు జిల్లా డీఈవోగా ఎస్ శ్యా మ్యూల్ పాల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా డిఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎస్ శ్యా మ్యూల్ పాల్ ను జిల్లా విద్యాధికారిగా ప్రభుత్వం నియమించడం పట్ల పలు వర్గాలు హర్షం వ్యక్తం అవుతున్నది.  శ్యామ్యుల్ పాల్ కర్నూలు జిల్లాలో విద్యాశాఖలో జూనియర్ జూనియర్ అసిస్టెంట్ గా బాధ్యతల్లో చేరి పనిపట్ల గౌరవాన్ని కలిగి నిబద్ధతతో విధులు నిర్వహించారు. సాదారణ ఉద్యోగి నుండి అంచలంచలుగా డిఈవో స్థాయికి ఎదిగారు. తన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆకస్మికంగా.  మరణించడంతో కుటుంబ కుటుంబ బాధ్యతలు  మీద పడటంతో  శామ్యూల్ పాల్ అనివార్యమైన పరిస్థితిలో తన మెడిసిన్ విద్యను వదులుకొని జూనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలలో చేరారు. చదువులో అత్యంత ప్రతిభ పాఠవాలు కలిగిన ఆయన శ్రీశైలం ఏపీ రెసిడెన్షియల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యను నాగార్జునసాగర్ లో పూర్తి చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖలో పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరుంది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పని రాక్షసుడిగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఉన్నతాధికారులు ఏ పని అప్పచెప్పినా తిరకరణ శుద్ధిగా పనిచేయడం ఆయన నైజం అని జిల్లా విద్యాశాఖలో అనుకుంటుంటారు. విద్యారంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. జిల్లాకు అనేక అవార్డులు తీసుకురావడంలో ఆయన కృషి అనిర్వచనీయం. వినయమూ, విధేయత కల్గిన ఆయన ఉపాధ్యాయ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.  ఇదే జిల్లాలో అంచలంచలుగా ఎదిగి, ఉన్నత అధికారిగా జిల్లా డీ ఈ ఓ గా నియమితులవ్వడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది. వివాదరహితుడిగా,  విద్యాశాఖలో గణనీయమైన విద్యాభివృద్ధికి కృషి చేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది. పదవ తరగతి పరీక్షల సందర్భంగా 24 గంటలు పనిచేస్తూ అన్ని స్థాయిలోని అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు స్తూ .. జిల్లాకు వచ్చిన ప్రతి డీఈవోలకు మక్కువైన అధికారిగా పనిచేయడం పట్ల ఆయనకు పేరుంది. జిల్లా విద్యాశాఖ చరిత్రలో ఆయన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జిల్లా DEO ga నియమితుడవ్వడం పట్ల అభినందనలు వెల్లువగా వస్తున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *