PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యలు సృష్టిస్తే దండన తప్పదు:డీఎస్పీ

1 min read

మిడుతూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే దండన తప్పదని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మధ్యాహ్నం డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని ఎక్కడ కూడా వాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పల్లెల్లో అలజడులు సృష్టించాలని గాని గ్రామాల్లో గొడవలు చేస్తే ఎవ్వరి నైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు.సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని ఎస్ఐ కి సూచించారు.స్టేషన్  రికార్డులను తనిఖీ చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఏ చిన్న సంఘటన జరిగినా ఎవ్వరినీ ఉపేక్షించవద్దని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యమని వాటికి విరుద్ధంగా ఎవ్వరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రికేయులతో డీఎస్పీ అన్నారు.రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.స్టేషన్ కు వచ్చే వారిని గౌరవించి సమస్యలపై ఎప్పటి కప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం, ఎస్ఐ హెచ్.ఓబులేష్,ఏఎస్ఐ లు సుబ్బయ్య,హరి ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author