జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాలకు అనుమతి
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో కొత్తగా 3 స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ లకు జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ (PC & PNDT Act) ఆమోదం తెలపడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.శనివారం కలెక్టర్ ఛాంబర్ లో PC&PNDT కి సంబంధించిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా జిల్లాలో PC & PNDT యాక్ట్ అమలు పై వైద్యాధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు.. గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు..ఆడపిల్లల సంరక్షణ కొరకు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ వైద్యశాఖ అధికారులకు సూచించారు.. తదనంతరం జిల్లా స్థాయి సలహా కమిటీ తనిఖీ చేసి సిఫారసు చేసిన 3 కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లకు, 9 రెన్యువల్ లకు, 6 సవరణలకి సంబంధించిన దరఖాస్తులను కమిటి ఆమోదించడమైనదని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా జడ్జి భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఎంహెచ్ఓ డా.భాస్కర్, నోడల్ ఆఫీసర్ డా.నాగప్రసాద్ బాబు, NGO ప్రతినిధి డా.బాలమద్దయ్య, ఎస్ఐ ప్రేమ, ప్రోగ్రామ్ కన్సల్టెంట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.