PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిజిహెచ్​లో  2 పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మిషన్ ల ప్రారంభం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అమెరికా లోని చికాగో లో నివసించే 1962,1963 బ్యాచ్ కు చెందిన కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు కృష్ణా రెడ్డి మరియు అరుణ దంపతులు  తమ మాతృమూర్తి పెన్నబడి గంగులమ్మ జ్ఞాపకార్థం 30 లక్షల విలువైన వివిధ ఎక్విప్మెంట్స్ ను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కర్నూలుకు విరాళంగా ఇచ్చారు.. అందులో భాగంగా ఈరోజు గైనిక్ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాలకు విలువైన వైద్య పరికరాలు పోర్టబుల్ రెండు అల్ట్రాసౌండ్ మిషన్ లను  ఈ రోజు గైనిక్, మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాలను ప్రారంభించినట్లు తెలిపారు.ఆసుపత్రి గైనిక్ విభాగంలో  గర్భవతులకు కాన్పు సమయంలో పేషంట్ దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. గుండె రేటు మార్పులు వచ్చినపుడు కారణాలు తెలుసుకోడానికి ఉపయోగిస్తారు.రెండో అల్ట్రా సౌండ్ మిషిన్ క్యాజువాలిటీ విభాగానికి వచ్చే ఎమర్జెన్సీ కేసులకు  పేషెంట్ల దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు.ఆర్ ఐ సి యు వెంటిలేటర్ మీద ఉండే కేసులకు కూడా పోర్టబుల్ అల్ట్రాసౌండ్ ద్వారా స్కానింగ్ చేసే వీలు ఉంటుందని తెలిపారు.త్వరలో ఇన్ఫెర్టిలిటీ విభాగం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇన్పెర్టిలిటి క్లినిక్ లో భాగంగా ఓవులేషన్ ఇండక్షన్ చేయడానికి లాప్రోస్కోపీ మరియు ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి అల్ట్రా సౌండ్ ఉపయోగపడుతుంది అని తెలిపారు. లెవల్1 ఇన్ఫెర్టిలిటి క్లినిక్ ప్రారంభం కు ఇది ఉపయోగపడుతుంది.. ఇది సక్సెస్స్ అయితే కృత్రిమ గర్భధారణ విభాగం 20 లక్షలతో ప్రారంభం కు కృషి చేసేందుకు దాతలు ముందుకు వస్తామన్నారు.పేషంట్స్ అటెండర్ బిల్డింగ్ కోసం మూడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇద్దరు పూర్వపు వైద్యులు  ముందుకు వచ్చినట్లు తెలిపారు. సెంట్రల్ ఫార్మసీ కొరకు కోటి రూపాయలు విలువగల బిల్డింగ్ కొరకు ప్రపోజల్స్ గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు జిల్లా కలెక్టర్ అప్రోవల్  తీసుకొని త్వరలో  అందుబాటులోకి తెస్తామని అన్నారు.గైనిక్ మరియు రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగపు వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలు అందజేసిన ఆసుపత్రి సూపరిండెంట్ సార్కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి గైనిక్ విభాగపు Hod, డా.శ్రీ లక్ష్మి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హె ఒ డి, డా.రామ్ శివ నాయక్, రేడియాలజీ విభాగపు హె ఒ డి, డా.రాధారాణి,  డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ, డా.హేమనలిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author