తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కు భారీ స్పందన
1 min readలక్ష రూపాయల రుసుము గల టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్న : వై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : కర్నూలు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ మంత్రి టి. జి. భరత్, ముస్లిం మైనారిటీ మినిస్టర్ ఎన్ ఎండి ఫరూక్ , జిల్లా అధ్యక్షులు తిక్కా రెడ్డి , ఎంపీ నాగరాజు ,ఎంపీ శబరి తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రనాయకులు, జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మంత్రి టి. జి. భరత్ , ముస్లిం మైనారిటీ మినిస్టర్ ఎన్ ఎండి ఫరూక్ చేతులమీదుగా భారీ ఎత్తున్న సభ్యత్వాలను నమోదు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వంద రోజుల పాలనాలలో అవ్వ తాతలకు పెన్షన్ 4000/- పథకము, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, నూతన ఇసుక విధానం, మద్యం పాలసీ, దీపావళికి మహిళలకు సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత ఎన్టీఆర్ పార్టీ బలోపేతానికి క్యాడర్ బలోపేతానికి గ్రామస్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీని పటిష్టం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. టిడిపి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ కల్పించి, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. లోకేష్ బాబు సభ్యత నమోదు చేసుకున్న యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసి టిడిపి సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేశారు.