రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పై గ్రామసభ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : లింగదహళ్లి గ్రామంలోని గ్రామసభలో మాట్లాతున్న ఆదోని డివిజనల్ సర్వేయర్ వేణుసూర్గతంలో జరిగిన రీ సర్వేలో భూ విస్తీర్ణంలో హెయ్యుతగ్గులు చోటు చేసుకోవడం పై మడ్డిలింగదహళీ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం మడ్డిలింగదహళీ ( ఎం.డీ హళ్లీ) గ్రామంలో తహశీల్దార్ సతీష్, ఆదోని డివిజనల్ సర్వే ఆఫిసర్ వేణుసూర్య ఆధ్వర్యంలో గతంలో జరిగిన రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పై గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా రీ సర్వేలో చాల మేరకు ఆడంగల్లో విస్తీర్ణంలో తేడాలు, తక్కువ భూమి నమోదు కావడం, ఇతర సమస్యలు ఉన్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలదేవిధంగా మ్యూటేషన్, విస్తీర్ణంలో చోటు చేసుకున్న తప్పులు, ఆన్లైన్ ఆడంగళ్లలో పేర్లు మార్పులు, ఇతర భూ సమస్యలతో కలుగుతున్న ఇబ్బందులు తదితర వాటి గురించి రైతులు అధికారుల దష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు వివిధ సమస్యల పై 92 మంది రైతులు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో సర్వే డీటీ ముకుందరావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.