సినిమా యాక్టర్ ను సన్మానించిన జనసేన పార్టీ నాయకులు..
1 min readడాక్టర్ బరికి చంద్రశేఖర్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో ఒక సాధారణ వ్యక్తి నరసింహాచారి తన నైపుణ్యంతో సినీ రంగంలోకి అడుగుపెడుతూ…. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్… ఇలా పలు వివిధ కళలతో సమాజం కోసం ఒక మంచి ఉన్నత విలువల గల సినిమాను రూపొందించి, మనకోసం.. మన ఊర్లో … మన ఎమ్మిగనూరులో … మినీ శ్రీనివాస సినిమా థియేటర్లో రంగస్వామి అనే సినిమాను 2024 అక్టోబర్ 25న విడుదల చేశారు.. సినిమా ను మంచి సాంకేతిక విలువతో రూపొందించడం జరిగింది.. అందులో మన ఎమ్మిగనూరు లొకేషన్స్.. బనవాసి ఫారం.. సుశీలాంబ కొండ.. గుడేకల్ గ్రామం పరిసరాలలో సినిమా షూటింగ్ జరుపుకోవడం చాలా బాగుంది… ఆ సినిమా చూసిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత నాయకులు గౌరవనీయులైన కే రవిప్రకాష్, ముఖ అతిథిగా హాజరై డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ అదినేత డాక్టర్ బారికి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో… గౌరవ ప్రభుత్వ వకీల్ మరియు నోటరీ మురళి కృష్ణ, విజయ్ మోహన్ ( రిటైర్డ్ యస్.ఐ) అద్యక్షతతో.., వారి ఆఫీసు నందు..ఇలాంటి వ్యక్తికి సమాజంలో మంచి గౌరవం ఉండాలని వారి అభ్యున్నతికి మా వంతు కృషిగా ఈరోజు రంగస్వామి సినిమా డైరెక్టర్.. కథా రచయిత.. మాటలు రచయిత.. మరియు హీరో నరసింహ చారి ని మా స్నేహితుడు డాక్టర్ బారికి చంద్రశేఖర్ చొరవతో సన్మానించడం జరిగింది..ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు చూసి సమాజంలో మార్పు కోసం కృషి చేస్తారని ఆశిస్తూ. కాసా రవి ప్రకాష్ వైస్ – ప్రెసిడెంట్ఎమ్మినూరు తాలూకా ఫోటోగ్రాఫర అసోసియేషన్ ..జనసేన పార్టీ చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.