PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సి. ఆర్. పి లకు డి. ఎస్. సి లో వెటెజ్ మార్కులు కేటాయింపుపై తమ పరిధి లో కృషి చేస్తా..

1 min read

న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎమ్. డీ. ఫారూఖ్……

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: క్లస్టర్ రీసోర్సెస్ పర్సన్స్ (సి. ఆర్. పి) లకు నవంబర్ లో ప్రకటించే డి. ఎస్. సి లో వెటెజ్ మార్కులు కేటాయించాలాని ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సి. అబ్దుల్ అజీజ్ న్యాయ శాఖా, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎమ్. డీ. ఫారూఖ్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది బి.ఎడ్, టేట్ పాసైన వారు సి. ఆర్. పిలు గా తమ కు కేటాయించిన పాఠశాలల ను విజిట్ చేస్తూ ఉపాధ్యాయుల తొ మమేకం అవుతూ పలు సూచనలు ఇస్తూ, సూచనల ను పాటిస్తూ విద్యార్థులకు గుణాత్మకం గా విద్యా అందిస్తూ, పాఠశాలలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.ఎక్కడైనా ఉపాధ్యాయులు కొరత ఉన్న చోట అవసరమైనప్పూడు బోధన ప్రక్రియ లో భాగమైతొ ఉన్నారు..గత 6 సంవత్సరాల నుండి డి. ఎస్. సి, జరగలేదు.. దాదాపు 30% మంది సి. ఆర్. పి లు ఏజ్ బార్ దెగ్గర లో ఉన్నారు. సి. ఆర్. పి లు చేస్తున్న విద్య పరమైన సేవలను దృష్టి లో ఉంచుకుని మానవతా దృక్పథంతో నవంబరు మొదటి వారంలో విడుదల కానున్న డి. ఎస్. సి  లో కనీసం 5 మార్కులు వెటెజ్ ఇస్తూ 5 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎమ్. డీ. ఫారూఖ్ కి సి. ఆర్. పి ల పక్షాన ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తరుపున వినతి పత్రం అందజేశారు.ఈ సంధ్యర్భం గా మినిస్టర్ ఫారూఖ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తపన పడుతున్న ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మరియు విద్యార్థుల చదువే దేశ అభివృద్ధికి పునాది ఆనుకుని స్నేహ పూర్వక వాతావరణం లో పాఠశాలల ను సందర్శించి పాఠశాలల ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నార లోకేష్  తొ చర్చించి రాబోయే డి. ఎస్. సి లో సి. ఆర్. పి లకు వెటెజ్ మార్కుల కేటాయింపు కు తమ పరిధిలో తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సి. ఆర్. పి సంఘాల నాయకులు వకీలు అహమద్, నవాజ్ బాష తదితరులు పాల్గొన్నారు.

About Author