ముస్లింలు మెచ్చుకునేలా పని చేయాలి
1 min read- : రాష్ట్ర మంత్రి టి.జి భరత్
- మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలులోని మహమ్మదీయ వక్ఫ్ కంప్లెక్స్ కేర్ టేకర్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా మహమ్మద్ ఇబ్రహీం, ప్రదాన కార్యదర్శిగా గౌస్ రబ్బాని, సభ్యులుగా రమీజ్ బాషా, షేక్ మహబూబ్, షేక్ అబ్దుల్ మునాఫ్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ముస్లింలకు ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలన్నారు. వక్ఫ్ కాంప్లెక్స్‌కు ఉన్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ముస్లింలంతా మెచ్చుకునేలా నూతన కమిటీ పనిచేయాలని ఆయన సూచించారు. కొత్త కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో 15 మంది పేద యువతుల వివాహాలకు ఒక్కొక్కరికీ రూ.3వేలు ఆర్థిక సహాయం వక్ఫ్ కాంప్లెక్స్ తరుపున ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, డి.యం.డబ్లూ.ఓ సబియా, టిడిపి నాయకులు జహంగీర్ బాషా, మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, హమీద్, నవీద్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.