ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి పార్టీ కృషి చేస్తుంది
1 min readకౌతాళం కి 100 పడకల హాస్పిటల్ ను సాంక్షన్ చేయిస్తా
బిజెపి మండల విస్తృత స్థాయి సమావేశం
హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కౌతాళం న్యూస్ : మండల కేంద్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బిజెపి మండల విశృతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే కౌతాళం మండల కేంద్రంలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మరియు ప్రతి ఒక్కరూ దేశం అభివృద్ధి కోసం బిజెపి సభ్యత్వం తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా కౌతాళం మండలానికి 100 పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తానని దీనికి టిడిపి నాయకులు మరియు జనసేన నాయకులు కూటమి నాయకులందరూ కలిసి నవంబర్ 4వ తేదీన రావాలని ఇక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలన్నిటిని టిడిపి మంత్రి టీజీ భరత్ దృష్టికి మరియు బిజెపి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లి కౌతాళం మండలానికి వంద పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తానని తెలిపారు.ఇంకా ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొని రావాలని ఆ సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నబిసాబ్,బిజెపి మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి,బిజెపి మండల కార్యదర్శి రామచంద్ర మరియు బిజెపి పెద్దకడబూరు మండల అధ్యక్షులు మేరమ్మ , నియోజకవర్గంలో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.