రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన … కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readరక్తదానం మరొకరికి ప్రాణదానం …. జిల్లా ఎస్పీ.
పోలీసు అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో రక్తదానం చేసిన … జిల్లా ఎస్పీ .
జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉచిత మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో జిల్లా ఎస్పీ రక్తదానం చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల స్పూర్తితో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ కల్పించడమేనన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, ఆపరేషన్ల సమయంలో రక్తం దానం చేయడం చాలా కీలకం అవుతుందన్నారు. అలాంటి ఆపద సమయంలో మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం అదృష్టంగా భావించాలన్నారు. రక్తదానం చేయడంపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బంది కి జిల్లా ఎస్పీ ఫ్రూట్ జ్యూస్ మరియు బిస్కెట్లను అందజేశారు.ఈకార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ , డిఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసరావు, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి , కర్నూలు గవర్నమెంట్ హస్పిటల్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ , బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ కిరణ్, సిఐలు, ఆర్ ఐలు ఎస్సైలు, ఆర్ ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.