అర్జీల పరిష్కారంలో గడువు దాటితే చర్యలు తప్పవు
1 min readఎప్పటికప్పుడు లాగిన్ చెక్ చేసుకుంటూ అర్జీలను పరిశీలించాలి
అధికారులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంలో గడువు దాటితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు..ఈ సందర్భంగా ఆదోని లో నీటి సరఫరాకు సంబంధించి వచ్చిన అర్జీ పరిష్కారంలో గడువు దాటడంపై కలెక్టర్ ఆదోని మున్సిపల్ కమీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో గడువు దాటకూడదని ఎన్నో సార్లు సమావేశాల్లో, వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పినప్పటికీ మళ్లీ గడువు దాటిన తర్వాత అర్జీ పరిష్కరించడం ఏంటి అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన సంబంధిత సెక్రటేరియట్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో గడువు దాటితే సహించేది లేదని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.లాగిన్ లో అర్జీలను ఓపెన్ చేసి చూడని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ఏడు రోజులైనా ఓపెన్ చూసి చూడరా అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.. వెల్దుర్తి, కృష్ణగిరి మండల వ్యవసాయ అధికారులు, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వద్ద ఏడు రోజులైనా అర్జీ చూడలేదని, వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి, డిఆర్వో లను ఆదేశించారు. అలాగే ఆదోని ఎంపిడిఓ వద్ద దరఖాస్తులు వచ్చి ఐదు రోజులు అయినా ఓపెన్ చేయలేదని ఎంపిడిఓకు నోటీసులు ఇవ్వాలని జిల్లా పరిషత్ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. అలాగే మిగిలిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు లాగిన్ చెక్ చేసుకుంటూ అర్జీలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.ఆర్డీఓ పత్తికొండ, ఆర్డీఓ కర్నూలు, డిపిఓ, సబ్ కలెక్టర్ ఆదోని , వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ ఈ ఈ, పత్తికొండ సర్వేయర్, డిఐజి కర్నూలు, ఆర్జేడీ కర్నూలు, ఎమ్మిగనూరు ఎస్డిపిఓ ల వద్ద 33 అర్జీలు రీఓపెన్ అయ్యాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.అలాగే సిఎంఓ గ్రీవెన్స్ కు సంబంధించి ఇంకా 28 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటికి ప్రాధాన్యతనిచ్చి, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు..సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.