ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాలి
1 min readఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని మండలాన్ని మండలాలుగా విభజించి అధికార వికేంద్రీకరణ చేసేందుకు సహకరించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కోరారు.సోమవారం సచివాలయంలోని సీఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడ మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ ఆదోని రూరల్ మండలం రాష్ట్రంలోని రెండో అతి పెద్ద మండలం అని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒకే మండలం ఉండడం కారణంగా అధికారులు తక్కువగా ఉండడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు కూడ తక్కువ రావడం వల్ల అభివృద్ది నోచుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రము లోని వేరే నియోజక వర్గాల కన్నా ఎక్కువ నిధులిస్తేనే ఆదోని నియోజకవర్గంలోని త్రాగునీరు ,సాగునీరు సమస్యలు ప్రతి గ్రామానికి మంచి రోడ్లు మరియు ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 25 కోట్లు ఎన్ ఆర్ జి ఎస్ నిధులు మండలానికి కేటాయించాలని కోరినట్లు తెలిపారు.