ప్రకృతి వ్యవసాయ బుక్ లెట్స్ లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రకృతి వ్యవసాయ బుక్ లెట్స్ ను కలెక్టర్ పి రంజిత్ బాషా ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించిన పకృతి వ్యవసాయానికి సంబంధించిన బుక్ లెట్స్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాచారాన్ని మరింత మెరుగ్గా వ్యాప్తి చేసేందుకు రైతు సాధికార సంస్థ వారు హ్యాండ్ బుక్ లెట్స్, ప్యాకెట్ బుక్ లెట్స్ లను ప్రచురించడం జరిగిందని అన్నారు. ప్రచురించిన ఈ బుక్ లెట్స్ ను జిల్లాలోని 25 మండలాలలో గల 141 రైతు సేవ కేంద్రాలకు, మరియు 247 గ్రామ ఐక్య సంఘాలలోని మహిళా రైతులకు అందేలా చూడాలన్నారు.రైతులందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించేందుకు అవసరమైన రీతిలో NF(Natural farming) యొక్క సార్వత్రిక సూత్రాలు, సప్త సూత్రాలు, ఏ గ్రేట్, ఏటీఎం, కషాయాల తయారీ విధానం వంటి వాటిని ఈ బుక్ లెట్స్ లో రైతులందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచురించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణమ్మ,జిల్లా వ్యవసాయ అధికారిని పి ఎల్ వరలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్ చంద్రశేఖర్, DLMP లక్ష్మయ్యMMTL వంశీకృష్ణ, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్, నాచురల్ ఫామింగ్ అసోసియేట్స్ మల్లికార్జున, బాసిద్, జగదీష్, భుజేశ్వరుడు, శ్వేత, అరుణ DPMU ప్రకృతి చేసి సిబ్బంది పాల్గొన్నారు.