ధాన్యాన్ని కల్లాలలోనే క్వాలిటీ నిర్ధారణ చేసి మిల్డర్లకు తరలించాలి
1 min readపౌర సంఘం నాయకులు జెడి కి వినతి పత్రం అందజేత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో రైతులు మరియు కౌలు రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాలలోనే క్వాలిటీ నిర్ధారణ చేసి మిల్లర్షకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పౌర సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించి రైతుల ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. జెడి ని కలిసిన వారిలో ఏపీ కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ను వెంకట్రావు, కార్యదర్శి దొంత కృష్ణ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, రైతు సంఘం జిల్లా నాయకులు వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు జెడి తో మాట్లాడుతూ కౌలు రైతులకు, రైతులతో సంబంధం లేకుండా కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇప్పించాలని మరియు కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. రైతులు పండించిన దాన్యమును ఆరబెట్టుకొనుటకు టార్పాల్స్ ను వ్యవసాయ శాఖ సరఫరా చేయాలని కోరారు.