వైస్సార్సీపీ అభిమానులు సిద్ధం కావాలి…
1 min readఆలూరు ఎమ్మెల్యే _బూసినే_విరుపాక్షి_
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గురువారం హాలహర్వి చేత్రగుడి దేవాలయ నందు అలాగే హోలుగుంద YSRCP మండల ల స్థాయి నాయకులతో ఆలూరు_ ఎమ్మెల్యే _విరుపాక్షి_ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ..ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఇకనుండి ప్రభుత్వ విధ్వంస రాజకీయానికి ఎదురు నిలబడి ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మంచి చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంసపాలన కి చమర గీతం పాడాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపితానికి మనమందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలంగా సంసిద్ధం చేసుకోవాలని ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే _విరుపాక్షి నాయకులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి మండలంలోని గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు వేయడం ద్వారా నాయకులలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హాలహర్వి మండలం కన్వీనర్ రామిరెడ్డి వైస్ ఎంపీపీ నాగేష్ హోలుగుంద కన్వీనర్ షాపిఉల్లా హోలుగుంద జడ్పీటీసీ శేషప్ప హాలహర్వి హోలుగుంద మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఎంపిటిసి మల్లికార్జున, ఎస్కే గిరి, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.