అరటి తోటల్లో ఫ్రూట్ కేర్ ఆక్టివిటీ పాటించడంతో నాణ్యత పెరుగుతుంది
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండలం లో నల్ల మేకల పల్లి,పి ఆర్ పల్లి మరియు హుసేనాపురం గ్రామాల్లో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఫ్రూట్స్ దేవముని రెడ్డి మరియు జిల్లా ఉద్యాన అధికారి యు నాగరాజు అరటి తోటలను సందర్శించారు. వారు అరటి తోటల్లో ఫ్రూట్ కేర్ ఆక్టివిటీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అరటి తోటల్లో ఫ్రూట్ కేర్ ఆక్టివిటీ పాటించడం వలన పండు పరిమాణం మరియు నాణ్యత పెరుగుతుంది ఇందులో భాగంగా అరటిలో పండు పరిమాణం మరియు నాణ్యత పెంచుటకు గెలలలోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5 రోజున మరియు 15వ రోజున సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి గెలల పై పిచికారి చేయాలి. దీనితోపాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథిన్ సంచులను గెలలకు తొడగడం వలన పండ్ల యొక్క పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లు పొందుట వలన విదేశాలకు ఎగుమతి చేయుటకు అనుకూలంగా ఉంటాయి. అరటి తోటల్లో పాటించే మెలకువలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అరటి తోటలోని సిగటోక తెగుళ్లు రాకుండగా నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఉద్యాన అధికారి జి కళ్యాణి , రైతు సేవ కేంద్ర సిబ్బంది బాలు,సురేంద్ర, నళిని, ఎగుమతి కంపెనీ ప్రతినిధులు మరియు, రైతులు పాల్గొన్నారు.