కౌతాళం లో 100 పడకల హాస్పిటల్ ను నిర్మించండి
1 min readఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసిన
హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల పురుషోత్తం రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ శుక్రవారం రోజున బిజెపి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను ధర్మవరంలో కలిసి వినతి పత్రం అందజేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి.కౌతాళంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ కౌతాళం మండలంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 పడకల ఆసుపత్రిని కౌతాళంలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందని ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందువలన కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని త్వరగా శాంక్షన్ చేయించి నిర్మించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.సత్య కుమార్ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి తొందర్లోనే వంద పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తానని అన్నారని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి తెలిపారు.