ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం చంద్రబాబు కే సాధ్యం
1 min readదీపం పథకం 2 ఉచిత సిలిండర్ల పంపిణి కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే సాధ్యం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం లోని సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈరోజు దీపం-2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని వాళ్ల ఎదుగుదలకు మొదటి అడుగు వంట గదిలోనే పడాలని ఎన్నికల హామీగా నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళా సాధికారత కోసం వంట ఇంటిలోనే మార్పు రావాలని ఈ మహాశక్తి పథకానికి నాంది పలికారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని నెలలు కు పథకాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కొంత మంది వైకాపా నాయకులు ఓర్వలేక అసత్య ఆరోపిణలు చేస్తున్నారని అలాంటి నమ్మ వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఆర్ఐ ఆదాం, టిడిపి నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, వరదరాజు, అశోక్ రెడ్డి, డీసీ తిమ్మప్ప, ఎంపిటీసీ మేకల వెంకటేష్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ బిబి జాన్, మహ్మద్ సలీం, హైస్కూల్ చైర్మన్ నరసింహ, నరసింహ, రాజన్న,రాఘవేంద్ర, బీమన్నా, దాసు, కల్లుదేవకుంట రాఘన్న, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.