విషాల్ ఫాబ్రిక్స్ లిమిటెడ్ హెచ్1ఎఫ్ వై ఫలితాలలో 66 శాతం వృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : భారత్లో ప్రీమియం క్వాలిటీ స్ట్రెచ్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ సరఫరాదారుగా ఉన్న విషాల్ ఫాబ్రిక్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 538598) 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్థవార్షికంలో స్వతంత్ర మరియు ఏకీకృత అపరిష్కృత ఆర్థిక ఫలితాలను అక్టోబర్ 25న జరిగిన బోర్డ్ మీటింగ్లో ఆమోదించింది.2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం (స్వతంత్ర)లో మొత్తం ఆదాయం రూ. 38478.40 లక్షలు కాగా, ఈబిఐటిడిఏ 41% వృద్ధితో రూ. 3052.13 లక్షలకు పెరిగింది. ఈబిఐటిడిఏ మార్జిన్ 7.93%గా ఉంది. పన్ను ముందు లాభం (పిబిటి) 92% పెరిగి రూ. 1201.62 లక్షలు నమోదు చేసింది, అలాగే పిఏటి 46% వృద్ధితో రూ. 649.56 లక్షలకు చేరుకుంది.అర్థవార్షికం (స్వతంత్రంగా)లో మొత్తం ఆదాయం రూ. 72740 లక్షలు కాగా, ఈబిఐటిడిఏ 34.38% వృద్ధితో రూ. 5720.84 లక్షలు నమోదు చేసింది. పిఏటి 66.54% వృద్ధితో రూ. 1127.38 లక్షలకు చేరుకుంది.కొత్తగా బోర్డు రూ. 153 కోట్ల విలువైన, ప్రోత్సాహక ధర రూ. 30.60 వారెంట్లను నాన్-ప్రొమోటర్ కేటగిరీకి కేటాయించడానికి ఆమోదించింది. అదనంగా, క్యూఐపీ ద్వారా రూ. 100 కోట్ల నిధులను సమీకరించేందుకు ఆమోదం లభించింది. ఈ నిధులను కంపెనీ వాటాదారుల ఆమోదంతో సేకరించనుంది.విషాల్ ఫాబ్రిక్స్ మార్చి 30, 2024న చిరిపాల్ టెక్స్టైల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 37.72% వాటాను కొనుగోలు చేసి, వారిని తమ అనుబంధ కంపెనీగా మార్చుకుంది.1985లో స్థాపించబడిన ఈ సంస్థ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడమే కాకుండా, కాటన్, మోడల్ మిశ్రిత ఫాబ్రిక్స్ సరఫరాదారుగా నిలిచింది.