స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్. బోర్డు 500 కోట్ల నిధుల సమీకరణను ఆమోదం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి) అయిన స్టాండర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (బిఎస్ఈ: 511700) తమ బోర్డ్ ఆమోదించిన నిధుల సమీకరణ ప్రతిపాదనను ప్రకటించింది. బోర్డ్ నిర్ణయించిన విధంగా, సంస్థ రూ. 500 కోట్ల వరకు 50,000 సెక్యూర్డ్, అన్‌లిస్ట్, అన్‌రేటెడ్, రిడీమబుల్ ఎన్ సి డి ను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా జారీ చేయడానికి సిద్ధమైంది.ఇటీవల, విద్యాసంస్థలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్ పి ఎస్) కోసం జీరో-కాస్ట్ ఈఎంఐ పథకాన్ని ప్రకటించింది. ఇది పాఠశాలల్లో అధ్యాపనను ఆధునీకరించడంలో ముందడుగు వేస్తుంది, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు టెక్నాలజీ ఆధారిత అనుభవం అందిస్తోంది. ఐఎఫ్ పి ల ద్వారా తరగతుల యొక్క ఆధునికీకరణతో పాటు, పాఠశాలలు చాక్, మార్కర్లు వంటి వనరుల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకా, చాక్ పొడి కారణంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు శ్వాస సంబంధిత సమస్యలు తక్కువ అవుతాయి.గ్లోబల్ ఆస్థ్మా రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో 6% పిల్లలు ఆస్థ్మాతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఇలాంటివి మరింత పెరుగుతాయి. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశంలో డిజిటల్ లెర్నింగ్ పెరుగుతోంది. 2025 కల్లా భారతీయ ఎడ్యుటెక్ మార్కెట్ $10.4 బిలియన్ వరకు చేరుతుందని అంచనా.”డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విద్య యొక్క భవిష్యత్తు. ఐఎఫ్ పి ల ద్వారా పాఠశాలలు ఆర్థిక భారం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు,” అని క్విక్‌టచ్ ఎండీ గౌరవ్ జిందాల్ అన్నారు.ఆర్థిక పరంగా, సంస్థ తన ఆస్తులపై 15-16% ఆదాయం పొందడం తో పాటు విద్యాసంస్థలపై అదనపు భారాన్ని పెట్టదు.