మాచిరాజు బాల సాహిత్య పీఠం బహుమతిని అందుకున్న రాచర్ల విద్యార్థిని
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:”కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని చేతులమీదుగా మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు నిర్వహించిన కథల పోటీల్లో మా పాఠశాలకు చెందిన విద్యార్థిని కె. ఐశ్వర్య బహుమతిని అందుకోవటం ఎంతో గర్వంగా ఉంద”ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఎస్.ఉమాదేవి అన్నారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, బాల సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాచిరాజు బాల సాహిత్య పీఠం పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు శ్రీ చొక్కాపు వెంకటరమణ, డాక్టర్ పత్తిపాటి మోహన్, శ్రీమతి కన్నెగంటి అనసూయ, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సమక్షంలోప్యాపిలి మండలం,ఎన్.రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కె. ఐశ్వర్య నగదు,శాలువా,ప్రశంసాపత్రంలతో అందుకున్నారు. కథ సాహిత్య సృజనలో తనదైన ప్రతిభను కనపరచి బహుమతి అందుకోవటం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అన్నారు.కార్యక్రమంలో పాఠశాల పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ తొగట సురేశ్ బాబు, విద్యార్థిని తండ్రి భాస్కరయ్య ఆచారి పాల్గొన్నారు.