ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 న నిర్వహించడమే హేతుబద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణపై సాంకేతిక, చట్టబద్ద నిర్ణయం అంటూ అధికా పార్టీలు గందరగోళం సృష్టిస్తున్నాయనీ, తమ తమ రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకొని పోయే దిశగా అసంబద్ధ “రోజున” రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రభుత్వాలు నిర్వహించాయి/ నిర్వహిస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.
శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం మరియు శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో తెలుగు రాష్ట్రం అక్టోబర్ 1, 1953 న ఏర్పడింది. ఈవిధంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దిశగా తెలంగాణతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు నవంబర్ 1, 1956 న జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణను జున్ 2, 2014 న విడగొట్టడంతో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భావన (concept) కు ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయని ఆయన వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ప్రభుత్వాలలో ఒక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించగా, ఇంకొక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం తో తెలంగాణ కలిసిన నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించాయని తెలిపారు.ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం తో ఏర్పడిన ఆంద్ర రాష్ట్ర ఏర్పాటుకు అక్టోబరు 1న నివాళులు అర్పించడమే సాంకేతికంగా చూసిన భావోద్వేగం (emotional) చూసిన సరైనది అని ఆయన అన్నారు. కాని రాజకీయ పార్టీల ఉచ్చులో పడి సమాజం లోని వివధ వర్గాలు నవంబర్ 1 న లేదా జూన్ 2 న శ్రీపొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం ఏ మాత్రం సాంకేతికం కాదు అని ఆయన అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంను అక్టోబర్ 1 నిర్వహించి శ్రీపొట్టిశ్రీరాములు ని గౌరవిస్తూ, శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో రాయలసీమ హక్కులను అమలు చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.