PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాయామంతో… ‘గుండె’ పదిలం..

1 min read

ఫాస్ట్​ ఫుడ్​ , ఆయిల్​ ఫుడ్​ కు దూరంగా ఉండండి…

  •  వాకింగ్​, రన్నింగ్​, స్విమ్మింగ్​ తో ఆరోగ్యం సురక్షితం..
  • సీనియర్​ కార్డియాలజి వైద్యులు, విజయ దుర్గా హాస్పిటల్​ ఎం.డి. డా. వసంత కుమార్​

కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక సమాజంలో పని ఒత్తిడి, సెల్​ఫోన్లు, టీవీల కారణంగా వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని,  దీంతో గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతూ… అతి చిన్న వయస్సులోనే మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీనియర్​ కార్డియాలజి వైద్యులు, విజయ దుర్గా హాస్పిటల్​ అధినేత డా. వసంత కుమార్​. ఆదివారం నగరంలోని ఏ క్యాంపు కర్నూలు హార్ట్​ ​ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజి,  ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో  కార్డియాలజి విద్యార్థులకు ‘ వ్యాయామం– గుండె’ సంబంధిత సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. వసంత కుమార్ విద్యార్థులకు, ప్రజలకు గుండె– వ్యాయామం సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు.  మద్యం, సిగరెట్​ కు బానిసైన యువత… హార్ట్​ ఎటాక్​ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన డా. వసంత కుమార్​…  ప్రతి రోజు గంటపాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తే గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు.  వాకింగ్​, రన్నింగ్​, స్విమ్మింగ్​ తో గుండె జబ్బులకు దూరంగా ఉండటంతోపాటు బ్రెస్ట్​ క్యాన్సర్​, లంగ్స్​ క్యాన్సర్​, కిడ్నీ క్యాన్సర్​, బీపీ, షుగర్​ తదితర వ్యాధులు దరిచేరవని స్పష్టం చేశారు.   

ఫాస్ట్​ ఫుడ్​ కు దూరంగా ఉండండి..:

అంతేకాక ఫాస్ట్​ ఫుడ్​, బయటి ఫుడ్​ భుజించడం తగ్గించుకోవాలని సూచించారు.  ఫోన్లు, టీవీలకు పరిమితమై… వ్యాయామం చేయకపోవడం… ఫుడ్​ కంట్రోల్​ లేకపోవడం తో గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని, దీని వల్ల హార్ట్​ ఎటాక్​ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రాత్రివేళ భోజనం చేసిన తరువాత కొంత నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు.

‘గుండె’ పై పట్టు పెంచుకోండి:

‘గుండె’ సంబంధిత వ్యాధులు, హృదయ స్పందన తదితర అంశాలను తెలుసుకొని ఉండాలని, అప్పుడే రోగికి మెరుగైన వైద్యం అందించవచ్చని సీనియర్​ కార్డియాలజి డా వసంత కుమార్​ కార్డియాలజి విద్యార్థులకు సూచించారు.  థీరితోపాటు ప్రాక్టికల్స్​ ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

డా. వసంత కుమార్​ కు ఘన సన్మానం:

 హార్ట్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెడికల్​ విద్యార్థులకు ‘ వ్యాయామం– గుండె ’ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించిన సీనియర్​ కార్డియాలజి, విజయ దుర్గా హాస్పిటల్​ అధినేత డా. వసంత కుమార్​ ను ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్​, గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్​, సభ్యులు చంద్రశేఖర్​ కల్కూర తదితరులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు.

About Author