కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల కమిషన్ ఏజెంట్ల అరాచకాలు
1 min readపట్టించుకోని ప్రభుత్వా అధికారులు సిపిఐ.. ఆందోళన
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ పట్టణంలోని ఉడుములపాడు దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ మండలంలోని దాదాపుగా 42 గ్రామాల రైతులు డోన్ పట్టణంలోని ఉడుముపాడు గ్రామం పరిధిలో ఉన్న కూరగాయల మార్కెట్ కు నిత్యం రైతులు కూరగాయలను మార్కెట్ తీసుకొస్తుంటారు అయితే పొద్దున 6 గంటలకు కూలి వాళ్లను తీసుకొని కూరగాయలు తెంపుకొని వచ్చేసరికి 12 గంటలు సమయం పడతా ఉంది తీరా మార్కెట్ వచ్చేసరికి టెండర్లు సమయం అయిపోయిందని మీరు సరుకు ఇక్కడే పెట్టుకోండి రేపు అమ్మేస్తామని లేదంటే తక్కువ రేట్ కి వ్యాపారస్తునికి పిలిచి ఇంత రేటుకి ఇస్తావా లేదంటే ఇక్కడే ఉంచుకో అది నీ ఇష్టం అని రైతులకు చెపుతారు. రైతు దిక్కు తోచని పరిస్థితుల్లో ఏరోజు ఎసమయంలో మార్కెట్ ఉంటుందో రైతులు అయోమయ పరిస్థితి లో ఉన్నారు.ఎంతో కొంతకి ఆటో కిరాయికి కూలీలకు వస్తాయని రైతుకి మరో మార్గం లేక తక్కువ రేట్ కి అమ్మేసి ఇంటికి ప్రయాణం అయ్యి వెళ్లిపోతారు రైతులకు సరైన టైము మార్కెట్లో టైమింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన రోజురోజుకు రైతులు భారీగా నష్టపోతున్నారు ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన రైతుల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు. రైతుల సమస్యలను డోన్ మార్కెట్ దళారులు పరిష్కరించకుంటే సిపిఐ పార్టీ రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని వారిని హెచ్చరిస్తూ డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఇంతియాజ్ కి కూరగాయల మార్కెట్ కు వచ్చేరైతుల సమస్యల పైన పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు రైతు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రైతులుఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బి నారాయణ పట్టణ కార్యదర్శి మో టా రాముడు సిపిఐ మండల సహాయ కార్యదర్శి వరదరాజులు ఏఐటియుసి నియోజవర్గ కార్యదర్శి అబ్బాసు పట్టణ సహాయ కార్యదర్శి Nk రామ్మోహన్ మహిళా సమైక్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి షమీం బేగం మహిళసమైక్య మండల కార్యదర్శి లక్ష్మీదేవి Aiyf మండల నాయకులు రంగస్వామి దివాకర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.