అపార్ ఐడి జనరేషన్ విషయంలో ప్రధానోపాధ్యాయుల పైన ఒత్తిడి తేవద్దు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన అపార్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రి ) ఐడి జనరేట్ చేసే విషయంలో అధికారులు ప్రధానోపాధ్యాయుల పైన అనవసర ఒత్తిడి పెంచుతున్నారని ఇది తగదని ఐడి జనరేషన్ విషయంలో కొన్ని రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్యాపిలి మండల విద్యాధికారి వెంకటేశ్వర నాయక్ కి వినతిపత్రం అందచేసినట్లు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో చేరే సమయంలో ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా విద్యార్థుల పేర్లను పాఠశాల అడ్మిషన్ రిజిస్టరు యందు నమోదు చేశామని ఐతే కొద్దిమంది విద్యార్థులు వారి అవసరాల మేరకు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆధార్ వివరాలు మార్పులు చేసుకోవడంతో పాటుగా పుట్టిన తేదీలు కూడా మార్పు చేసుకోవడం జరిగిందని దానివల్ల ఇప్పుడు అపార్ ఐడి జనరేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా అడ్మిషన్ రిజిస్టర్ యందు మార్పులు చేయవలసి వస్తే రిజిస్టర్ మొత్తం తప్పుల తడకగా అవుతుందని,ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు మారిస్తే దానికి అనుగుణంగా ప్రైమరీ పాఠశాలలలో కూడా వివరాలు మార్పులు చేయవలసి వస్తుందని గుర్తు చేశారు.కావున పాఠశాల రికార్డుల యందు ఉన్న వివరాల ఆధారంగా ఆధార్ కార్డు యందు వివరాలు మార్పు చేయడం కొరకు మరి కొన్ని రోజులు సమయం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రమేష్ నాయుడు.మండల సీనియర్ నాయకులు నెల్లూరప్ప,శాంతి కుమార్,రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.