వాసంతి కుటుంబానికి వైసీపీ పది లక్షలు..
1 min readనాలుగు నెలలైనా దొరకని బాలిక బాడీ:కాటసాని
సొంత ఖర్చుతో కుమారుడికి విద్య:డాక్టర్ సుధీర్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముచ్చుమర్రి చిన్నారి వాసంతి అదృశ్యమై నాలుగు నెలలు అయినా కూడా ఇంతవరకు డెడ్ బాడీ దొరకలేదని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వాసంతి కుటుంబాన్ని ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి,ఎమ్మెల్సీ ఇసాక్ భాష,కాటసాని,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,నందికొట్కూరు ఇన్చార్జి ధారా సుధీర్ పరామర్శించి కుటుంబానికి పార్టీ తరఫున పది లక్షల చెక్కును వారు అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ మా ప్రభుత్వ హయాంలో అమ్మాయిలకు ఏ కష్టం వచ్చినా వారికి దిశ చట్టం ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చేశామని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాన్ని నిర్వీర్యం చేసిందని అంతే కాకుండా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలపై ఎన్ని దౌర్జన్యాలు జరిగినా పోలీస్ శాఖ ఏం చేస్తుందనేది తెలియని పరిస్థితి ఉందని ఈ గ్రామంలో అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో అదే గ్రామంలోనే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే నిందితులకు భయం వల్ల ఇలాంటి సమస్యలు పునరావృతం కావని అన్నారు.కుటుంబానికి మనోధర్యం ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చామని ఆయన పాత్రికేయులతో అన్నారు. నందికొట్కూరు ఇన్చార్జి దార సుధీర్ మాట్లాడుతూ చిన్నారి వాసంతి అన్న అయిన మహేష్ ను నందికొట్కూరు విజయ వాణి ప్రైవేట్ పాఠశాలలో తానే సొంత ఖర్చుతో చేర్పించానని ఈ కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు దౌర్జన్యాలు హత్యలు చేయడమే తప్పా అభివృద్ధి లేదన్నారు.కనీసం చిన్నారి ఎముకలను అయినా చూపించండి అని తల్లిదండ్రులు వేడుకుంటున్నారని డాక్టర్ సుధీర్ అన్నారు.మనో ధైర్యంతో ఉండాలని వారు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు,నాగార్జున రెడ్డి, నాగ సేనా రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.