PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉల్లి రైతుకు  నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం..

1 min read

అటు రైతుకు, ఇటు వినియోగదారుడికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడుతాం

రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ పని చేయని పరిస్థితులలో వెంటనే ఆఫ్లైన్ లో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం

జిల్లా ఇన్చార్జి మంత్రి,  రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  ఉల్లి రైతుకు  నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి,  రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.సోమవారం  కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర  ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు.. రైతులకు నష్టం, కష్టం లేకుండా పరిపాలన సాగాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఆకాంక్ష అన్నారు..ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డును సందర్శించామన్నారు….  కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర నుండి కూడా కర్నూల్ మార్కెట్ యార్డ్ కు పెద్ద ఎత్తున ఉల్లి వస్తోందన్నారు..అటు రైతుకు, ఇటు వినియోగదారుడికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.గత పది రోజులుగా కర్నూల్ ఉల్లి మార్కెట్ గురించి వార్తలలో  ప్రచురితం అవుతున్న ఉల్లి కథనాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నామన్నారు.. ఈ కథనాల గురించి మంత్రి, కలెక్టర్, సెక్రెటరీ లతో కూడా ఎప్పటికపుడు చర్చిస్తున్నామన్నారు.గత నెలలో కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఈనామ్ పోర్టల్  లో సాంకేతికంగా సమస్యలు రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్ పని చేయని పరిస్థితులలో వెంటనే ఆఫ్లైన్ లో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గత అక్టోబర్ నెలలో కర్నూలు మార్కెట్ యార్డ్ కు 2 లక్షల 25 వేల క్వింటాళ్ల ఉల్లి వస్తే, గత ఏడాది అక్టోబర్ లో కేవలం 52 వేల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చిందన్నారు.. గత సంవత్సరం కంటే 4 రెట్లు అధికంగా దిగుబడి వచ్చినా రైతుకు నష్టం జరగకుండా కొనుగోలు చేయడం జరిగిందన్నారు..గత నెలలో కొనుగోలు చేసిన ధర కూడా సగటుగా  3 వేల 180 రూపాయలతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  గత ప్రభుత్వంలో  అక్టోబర్ నెలలో కేవలం 52 వేల క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చినప్పటికీ కూడా వారు కొనుగోలు చేసింది సగటుగా  2 వేల 400 రూపాయలు మాత్రమే అన్నారు.. గతం లో కంటే 4 రెట్లు దిగుబడి అధికంగా వచ్చినా, గత ప్రభుత్వం ధరలకంటే ఎక్కువ ధర ను రైతులు పొందారన్నారు.మార్కెట్ యార్డ్ లో ఉన్న రైతులతో మాట్లాడినప్పుడు వర్షాలు పడ్డం వల్ల ఎకరానికి దిగుబడి 70 నుండి 80 క్వింటాళ్ల వరకు పెరిగిందని రైతులు చెప్పారన్నారు…  దిగుబడి ఎంత వచ్చినా రైతులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు.కర్నూలు మార్కెట్ యార్డ్ లో  రెండు షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు హమాలీలకు తగిన  సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.. అలాగే ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.గత ప్రభుత్వం వ్యవసాయం, హార్టికల్చర్ లను గాలికొదిలేసిందన్నారు..గత ఐదేళ్ల కాలంలో  ఒక ఎకరానికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదని, ఇరిగేషన్ ను కూడా నీరు కార్చారన్నార. 2014-19 సంవత్సరంలో తమ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాలకు 11వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని, గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో కనీసం 2 వేల కోట్ల రూపాయల నిధులను కూడా రాయలసీమ ప్రాంతాలకు ఖర్చు పెట్టలేదన్నారు…  రైతాంగానికి ఉపయోగపడే విధంగా అటు ఇరిగేషన్ వ్యవస్థను,ఇటు  రైతాంగాని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్తామన్నారు.చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకు కర్నూలు మార్కెట్ యార్డ్ నడిబొడ్డున ఉన్నందున  రైతులు ఇబ్బంది పడకుండా, దళారులు సిండికేట్  అవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కోడుమూరులో కూడా ఉల్లిమార్కెట్ ను అభివృద్ధి చేసేందుకు తగిన  చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.తొలుత మంత్రి ఉల్లి రైతులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు… లాలప్ప, రామాంజనేయులు అనే రైతులతో మాట్లాడుతూ ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? ట్రాన్స్పోర్ట్ చార్జీలకు ఎంత ఖర్చు అవుతుంది?  తదితర విషయాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు.కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కర్నూల్ ఆర్డీవో సందీప్ కుమార్, మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *