PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భగవద్గీత -జీవనగీత…

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భగవద్గీత మానవుడు ఎలా శ్రేష్ట మానవుడుగా పరిణతి చెందవలెనో, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవలెనో తెలుపుతుందని, భగవద్గీత జీవనగీత‌‌‌ అని, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని నవనంది విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన మానవులందరికీ భగవద్గీత పుస్తక ప్రసాదం విద్యార్థులకు ఉచితంగా అందించే కార్యక్రమంలో వారు విద్యార్థులను ఉద్దేసించి భగవద్గీతపై ప్రవచించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లా విశ్రాంత వైద్య అధికారి డాక్టర్ పూజారి మోక్షేశ్వరుడు మాట్లాడుతూ విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని, అప్పుడే సమాజంలో దుష్పరిణామాలు దూరమవుతాయన్నారు. నవనంది విద్యాసంస్థల అధినేత శ్రీధర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు శివశంకర రెడ్డి, పాఠశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులందరికీ మానవులందరికీ భగవద్గీత ఉచిత పుస్తక ప్రసాదం అందించారు.

About Author