విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం.. జిల్లా ఎస్పీ
1 min readప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 88 ఫిర్యాదులు .
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 88 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
నాకు ఎస్ బి ఐ యోనో బ్యాంకు రివార్డు పాయింట్స్ పెంచుతామని చెప్పి నా మొబైల్ కు ఒక లింకు వచ్చిందని , నేను నమ్మి ఆ లింకు ను క్లిక్ చేస్తే నాకు ఎస్ బి ఐ యోనో బ్యాంకు యాప్ మాదిరిగా వచ్చిందని , నా బ్యాంకు వివరాలు ఎంటర్ చేయగానే నా బ్యాంకు ఖాతా ను సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేసి రూ. 47, 856 తీసుకున్నారని తిరిగి రికవరీ చేసి ఇప్పించాలని కర్నూలు , వాసవి నగర్ కు చెందిన మోహన్ ఫిర్యాదు చేశారు. కర్నూలు కు చెందిన శారదమ్మ నా తమ్ముళ్ళకు అటెండర్ , వాచ్ మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ. 5 లక్షల 50 వేలు తీసుకొని మోసం చేసిందని కర్నూలు బుధవార పేటకు చెందిన వాణీ పుష్పలత ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి కి చెందిన ప్రశాంత్ బాబు రూ. 4 లక్షలు తీసుకొని సివిల్ సప్లై లో సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని కర్నూలు , శ్రీరామ్ నగర్ కు చెందిన అరుణాదేవి ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.