PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బుధవారం  ఉదయం 11 గంటలకు    ముజఫర్ నగర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో   జరుగుచున్న  ఆశా డే కార్యక్రమాంలో డెమో శ్రీనివాసులు  పాల్గొన్నారు,.  అనంతరం మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని  చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినవారికి ,చేయించినవారికి, అందుకు సహకరించినవారికీ  జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారని తెలిపారు. .కూతురు అంటే భారం కాదు వరమని, అడయిన మగయిన ఇద్దరు ఒకటే నని  ఆడ పిల్లలను మగపిల్లలతో సమానంగా పెంచాలని చిన్నారులకు సురక్షిత స్పర్శ,చెడు స్పర్శ వంటి అంశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.,వైద్యాధికారి డాక్టర్. డి.సుప్రియా గారు మాట్లాడుతూ  బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని ,ఈ వివాహాలు జీవితలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని తెలిపారు.బాల్య వివాహాల వలన ప్రసూతి మరణాలు,శిశుమరణాలు పెరుగుతాయని తెలిపారు,బాల్య వివాహల్లో పాల్గొన్న తల్లితండ్రులు,బంధువులు,పురోహితులు, సహకరించినవారు  కూడా చట్టం ప్రకారం శిక్షర్వులవుతారని తెలిపారు.కౌమార దశలోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా ఆడ పిల్లలు చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం తీవ్ర అనారోగ్యలకు దారి తీస్తుందని , గర్భవతి దశలోనే ఆరోగ్య సమస్యలను తెచ్చుకొని ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని తెలిపారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వలన రక్తపోటు,పోషకాహార లోపము,తరచూ అస్వస్థకు గురికావడము ,తక్కువ బరువు కలిగిన శిశువులకు జన్మనివ్వడము,  లాంటి సమస్యలు వస్తాయని తెలిపారు, చిన్న వయస్సులో గర్భము దాల్చడము  వలన పిల్లల భాద్యతలు మోయలేక అనారోగ్యం పాలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమములో  పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు   ప్రొజెక్షనిస్ట్ ఖలీల్  పాల్గొన్నారు.

About Author