ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక అభివృద్ధి దృష్టి సారించాలి – ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : నిన్నటి రోజున కలెక్టర్తో సమావేశంలో ఆలూరు నియోజకవర్గం లోని ఆరు మండలాల సమస్యలు లేవనే త్తడం జరిగింది.ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ:- ఆలూరు నియోజకవర్గం లోని ఆరు మండలలో ఉన్న సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తారని విన్నవించుకుంటున్నాను ముందుగా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో నూతన భవనాన్ని నిర్మించారు. అందులో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా హాస్పిటల్ ప్రాంగణంలో వర్షం వస్తే బురద మయంగా మారుతుందని హాస్పిటల్ ప్రాంగణంలో సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆలూరులో నిరుపయోగంగా ఉన్న చెరువును కొంతమంది కబ్జాకు గురి చేస్తున్నారు కావున ఆ చెరువును ss ట్యాంక్ మార్చి ఆలూరు ప్రజలు దహర్తిని తీర్చాలని.నియోజకవర్గంలో మిర్చి రైతులకు లాస్ట్ ఇయర్ పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని అందుకు మీరు ప్రభుత్వంతో చర్చించి మా రైతులకు మిర్చి ఎక్స్పోర్ట్ వచ్చే విదంగా కృషి చేయాలని అదేవిధంగా దేవనకొండ మండలంలోని యురేనియం తవ్వకాలకు 2017లో ఆప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని దాన్ని మళ్లీ ఇప్పుడు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అందుకోసం దేవనకొండ మండల ప్రజల అబిష్టం మేరకు అక్కడ యురేనియం తవ్వకాలు జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని అందుకోసం ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా25 చెరువులు హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులు నింపాలని అదేవిధంగా హొళగుంద .ధనాపురం టు హొళగుంద రోడ్డు.ముందుగా పూర్తి చేయాలని అదేవిధంగా ఆస్పరి రైతులకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అదేవిధంగా చిప్పగిరి మండలానికి సంబంధించిన హంద్రీ నువ్వా కెనాల్కో తూము ఏర్పాటు చేసి చిప్పగిరి హాల్హర్వి మండల రైతులను ఆదుకోవాలని అదేవిధంగా నగరాదోనా బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్ కూడా పూర్తి చేయాలని అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సిసి రోడ్ల సమస్య అధికంగా ఉందని సత్వర పరిష్కారానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుతున్నాను._