ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలి…
1 min readఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) డిమాండ్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆశ వర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమ అధికారులు యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) హోళగుంద మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆశా డే సందర్భంగా భోజన విరామ సమయం నందు హోళగుంద వైద్యాధికారి న్యూటన్ సార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు హోళగుంద మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 9 నెలలు కావస్తున్న ఇంతవరకు ఒప్పంద జీవోలను సర్కులర్లను విడుదల చేయకపోవడంతో ఆశా వర్కర్లు ఆందోళనకు గురవుతున్నారని వారు అన్నారు ఇప్పటికీ చాలామంది ఆశ వర్కర్లను రిటైర్మెంట్ చేశారని 60 నుండి 62 సంవత్సరాల పెంపుదల జీవో రాకపోవడంతో ఆశ వర్కర్ల ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కూడా అందలేదని ఆశా వర్కర్లు ఈ కాలంలో చాలామంది మరణించడం జరిగిందని వారికి బీమా సౌకర్యం కూడా అందలేదని వారు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒప్పంద జీవులను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కోసిగి వైద్యాధికారి మనోజ్ కుమార్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.