PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ ఫీజులపై చర్చించి విడుదల చేయాలి

1 min read

విద్యారంగ సమస్యలపై చర్చించాలి.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొద్దిసేపు విద్యార్థి సంఘ నాయకులు పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. అనంతరం డిఆర్ఓ బయటకు రావడంతో సమస్యలతో కూడుకున్న వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ఉన్న సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్న పెండింగ్లో ఉన్న 3, 480కొట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయలేదని దాంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి నెలకొందని  అన్నారు. అదేవిధంగా కె.వి.ఆర్ జూనియర్ కళాశాలకు హాస్టల్ భవనాలు నిర్మించాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు అమలు చేయలేదని ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు 3 వేలకు పెంచాలని, తుగ్గలి దేవనకొండ మండల కేంద్రాల్లో ఏపీ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని తల్లికి వందనం కింద ఇస్తానన్న 15వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిగ్రీ లో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ చదివి విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. డి.ఆర్.ఓ నారాయణమ్మ స్పందిస్తూ స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని, మిగిలిన సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. కలక్టర్, అధికారులతో రెండు రోజుల్లో చర్చలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి జిల్లా ఉపాధ్యక్షులు శీను రవి సహాయ కార్యదర్శిలు విజయ్ జిల్లా నాయకులు అమర్ మల్లేష్ అబ్బు గౌస్ అంజి కాజా నాయకులు మనోహర్ తరుణ్ శంకర్ భాస్కర్ యోగి ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు.

About Author