దళితులైనందుకు మధ్యాహ్నం భోజనం పథకంలో తొలగింపు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : తీవ్రంగా ఖండించి, హోళగుంద ఎంఈఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, ఎంఈఓ సచ్చిదానందకు ఫిర్యాదు చేసిన బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్, మాలమనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందవరం నరసప్ప లు ఈ సందర్భంగా నాయకులు అమ్రేష్, నరసప్ప, వెంకటేష్, ఎల్లప్ప, ప్రసన్న, గడ్డం హుసేని లు మాట్లాడుతూ .. హొళగుంద మండలం, వందవాగిలి గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి పొదుపు సంఘం యస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు మధ్యాహ్న పథకంలో వంట ఏజెన్సీలో భాగస్వాములై ప్రభుత్వం విరికి ఆర్థిక సపోర్ట్ కల్పించిందని అన్నారు, సుమారుగా 10 గ్రూపులు 80 మంది ఇందులో భాగస్వాములై భోజనం పథకం ద్వారా జీవనం కొనసాగిస్తున్నారన్నారు, ఒక్కో సంవత్సరం రెండు గ్రూప్స్ వారు వంట వండేవారు, ఈ సంవత్సరంలో శివ, గాంధీ, శాంతి, అంబేద్కర్ గ్రూప్ వారు వీరి వంతు ఈ సంవత్సరం వచ్చిందన్నారు, వీరు ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారన్నారు, మాదిగ కులస్తులు వండిన వంట బీసీ, ఓసి కులాల పిల్లలు తినకూడదనే ఒక చెడు అభిప్రాయంతో ఈ మధ్యకాలంలో కొత్తగా ఎస్ఎంసి కమటీ చైర్మన్ గా ఎన్నికైన చిగిలి మల్లప్ప మరియు గ్రామ ప్రస్తుత తెలుగుదేశం నాయకులు జీరా బసవరాజు, బెలగల్ ఎంకప్ప, గరవ గోవిందు లు ఆ గ్రూప్ సభ్యుల పైన తప్పుడు సమాచారం ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీవో గార్లకు అందజేసి వారికి ఏమాత్రం నోటీసులు తెలపకుండా ఏకపక్షంగా విచారణ పేరుతో వారిని తొలగించి వేరే ప్రైవేట్ వ్యక్తులకు వంట ఏజెన్సీలో భాగం కల్పించడం చాలా దారుణమని మండిపడ్డారు, కేవలం వారు ఎస్సీ మాదిగ కులస్తులైనందుకే ఇలా చేశారన్నారు, సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయకుండగా తెలుగుదేశం పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో వారు చెప్పినట్లుగా తప్పుడు ఎండార్స్మెంట్ వ్రాసి ఆ గ్రూప్ సభ్యులను మిడ్ డే మీల్స్ నుంచి తొలగించడం చాలా అన్యాయమన్నారు, తక్షణమే రీ ఎంక్వయిరీ చేసి వారిని యధా స్థానంలో ఉంచకపోతే జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ లను సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. హోళగుంద ఎంఈఓ సచ్చిదానంద మాట్లాడుతూ రీ ఎంక్వయిరీ చేసి పొదుపు సంఘం మహిళలకు న్యాయం చేస్తామని తెలియజేశారు, ఇందులో నా పాత్ర ఏమి లేదని మిడ్ డే మిల్స్ కి చైర్మన్ ఎమ్మార్వో గారేనని మొత్తం హోలగుంద ఎమ్మార్వో గారే చేశారని తెలియజేశారు, అనంతరం బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్ హోలగుంద ఎమ్మార్వో గారికి ఫోన్లో సమాచారం అడగగా ఎంఈఓ రాసిన స్టేట్మెంట్ ప్రకారమే మేము నిర్ణయం తీసుకున్నామని మా పాత్ర ఏమి లేదని మొత్తం ఎంఈఓ దేనని అన్నారు, ఒకరి మీద ఒకరు అధికారులు నెట్టుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు తక్షణమే మిడ్ డే మీల్స్ లో పొదుపు మహిళలను నియమించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వందవాగిలి పొదుపు సంఘం మహిళలు సుజాత, చిన్న గంగమ్మ, తాయమ్మ, లక్ష్మి, మహంకాళి, లలితమ్మ, ఈరమ్మ, దుర్గమ్మ, హంపమ్మ, నరసమ్మ, మారెమ్మ, వన్నూరమ్మ, హనుమంతమ్మ, అంజనమ్మ మరియు వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.