అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..
1 min readపత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన
సచివాలయం 3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ పరిశీలన
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మెల్యే కెఈ. శ్యాం బాబు హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో ఆయన సుడిగాలి పర్యటన చేసి, సచివాలయం3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం-3 లో అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. కార్యాలయంలో ఒక ఉద్యోగి మాత్రమే ఉండడంతో మిగిలిన ఉద్యోగులు ఎక్కడని ప్రశ్నించారు. ఫీల్డ్ కు వెళ్లారని చెప్పడంతో, మీ కార్యాలయంపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్ప వని ఆయన హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రంలో కాలం చెల్లిన యూరియా బస్తాలు చూసి ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో అధికారులకు ఏం చెప్పాలో తెలియకపోవడంతో, వెంటనే వాటన్నిటిని క్లీన్ చేసి కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పారు. మరోసారి తనిఖీకి వచ్చినప్పుడు ఇలాంటివి కనిపిస్తే చర్యలు తీసుకుంటారని ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు వేసిన వ్యాక్సిలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న సమస్యల గురించి సిబ్బంది ఆయనకు తెలపడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ కి వెళ్లిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో పనిచేయని ఆరో ప్లాంట్ పై ప్రిన్సిపాల్ ని ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఎలా వృధాగా వదిలేస్తారని వెంటనే దాన్ని బాగు చేయించాలని చెప్పారు.