బ్రాహ్మణులను అవమాన పరుస్తున్న టిడిపి
1 min readతిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం అవమానకరం
వైసిపి నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ విమర్శ
పల్లెవెలుగు వెబ్ కమలపురం : రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేసి అవమాన పరుస్తోందని వైసీపీ రాష్ట్ర నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ తెలుగుదేశం పార్టీ పై ద్వజం ఎత్తారు. కమలాపురం లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం లో అధికారం లోకి వస్తే బ్రాహ్మణ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల కమిటీలలో బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తానని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు చేయలేకపోవడం బ్రాహ్మణులపై ఆయనకున్న కపట ప్రేమకు నిదర్శనం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్లలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బ్రాహ్మణుడికి కూడా స్థానం కల్పించక రాష్ట్రంలోని యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచారన్నారు. టీటీడీ బోర్డులో బ్రాహ్మణులకు స్థానం దక్కుతుందని అనేకమంది రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు ఆశించారని అయితే బోర్డు నియామకంలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడంతో రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. టీటీడీ బోర్డులో మొత్తం 29 మంది మెంబర్లను నియమించినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక బ్రాహ్మణుడికి కూడా అవకాశం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. అలాగే రాష్ట్రంలో 21 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి నప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బ్రాహ్మణునికి కూడా కార్పొరేషన్ లో స్థానం కల్పించకపోవడం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుడ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని అర్థమవుతోందన్నారు. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ విజయం కోసం వాడుకున్న చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తుండడం భావ్యం కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానంలో గత ఐదు సంవత్సరాలుగా తాను వైసిపి పై పోరాటం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీలో బ్రాహ్మణులకు ఎటువంటి న్యాయం జరగదనే ఉద్దేశంతో ఎన్నికలకు చివరలో తాను వైసీపీలో చేరానన్నారు. బ్రాహ్మణుల పట్ల విశ్వాసం కలిగిన జగన్మోహన్ రెడ్డి వెంట రాష్ట్రంలోని బ్రాహ్మణులు నడవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు చేసి బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈరోజు వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు కమిటీని సైతం నియామకం చేయకపోవడం బ్రాహ్మణులకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. బ్రాహ్మణుల పట్ల వివక్ష చూపుతున్న తెలుగుదేశం పార్టీని బ్రాహ్మణులందరూ విడనాడాలన్నారు. ఎంతోమంది రాష్ట్రంలోని బ్రాహ్మణులు బ్రాహ్మణ సంఘాల నాయకులు ఎన్నో ఎన్నెన్నో ఆశలతో ఆశయాలతో చంద్రబాబు నాయుడు కు మద్దతు పలికారని అయితే వారి ఆశల ను ముఖ్యమంత్రి అడియాసలు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా తాను ఇచ్చిన మాట మేరకు టీటీడీ బోర్డులో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బ్రాహ్మణుడికైనా స్థానం కల్పించాలని కోరారు.