PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంగ్లో -ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి- మంత్రి

1 min read

మంత్రి ఫరూక్ ను కలిసిన ఏడు రాష్ట్రాల ప్రతినిధుల బృందం

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్  కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను  పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి  ఫరూక్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని   మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ పేషి లో  ఆంగ్లో-ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం (ఏపీ & తెలంగాణతో సహా 7 రాష్ట్రాలతో కూడినది) మంత్రి ఫరూక్ ను కలిశారు.ఫెడరేషన్  జాతీయ అధ్యక్షుడు డా.ఎ.రాయ్ రోజారియో,  ప్రధాన కార్యదర్శిఎన్.పాట్రిక్ డూలాండ్,సభ్యులు బార్బరా ఆన్ బెర్చీ, అమలా వాలెస్,నిక్సన్ డి’క్రూజ్, కొరెట్టా అలియాస్ కవిత,కోరిన్ న్యూబెగింగ్ లు మంత్రి ఫరూక్,మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కే హర్షవర్ధన్,ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ ఏ.శేఖర్ ల దృష్టికి ఆంగ్లో ఇండియన్స్ ఎదుర్కొంటున్న  సమస్యలను వివరించారు.  రాష్ట్రంలో దాదాపు లక్ష దాకా ఆంగ్లో ఇండియన్స్ జనాభా ఉందని, అయితే ఎటువంటి అభివృద్ధికి సంక్షేమానికి నోచుకోలేక  పడుతున్న ఇబ్బందులను ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ఆంగ్లో ఇండియన్స్ కు చట్టసభల్లో ప్రాతినిధ్యానికి కేటాయింపులు, ఉన్నత విద్య అభ్యాసనం,  ఉపాధి కోసం రిజర్వేషన్ అమలు,బ్యాంకుల నుంచి రుణాలు అందేలా సరళీకృతమైన  విధానాలు తో పాటు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా మైనారిటీ  సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో  ఆంగ్లో ఇండియన్స్ కు  దక్కాల్సిన  సంక్షేమ ఫలాలు,  నామినేటెడ్ పదవుల  కేటాయింపులో భాగంగా  వివిధ సంస్థల్లో  ప్రాతినిధ్యం  కల్పించే చర్యలను  గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం జరిగిందని అన్నారు.ఆంగ్లో ఇండియన్స్  కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు, వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలను  సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి  ప్రభుత్వం ద్వారా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఫెడరేషన్ ప్రతినిధుల బృందానికి మంత్రి  ఫరూక్ హామీ ఇచ్చారు.అనంతరం సిక్కుల సంఘం ప్రతినిధులు కూడా మంత్రి ఫరూక్ ను కలిశారు.  ఏపీలో సిక్కుల  ఆర్థిక స్వావలంబన,  సంక్షేమం కోసం ప్రత్యేకంగా సిక్కుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలవాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. సిక్కు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా  సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *