PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెల్లో పర్యటించిన బిషప్ జ్వాన్నేస్..

1 min read

నూతన సిలువ ప్రతిష్ట మహోత్సవం

సంఘాల అభివృద్ధికి కృషి: బిషప్..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు నందికొట్కూరు: కథోలికుల సంఘాలు ఇంకా బలపడాలని కర్నూలు(ఆర్ సీ ఎం)బిషప్ గోరంట్ల జ్వాన్నేస్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని ఉప్పలదడియ విచారణలో ఉన్న ఉప్పలదడియ, దేవనూరు,49 బన్నూరు,కడుమూరు, కేతవరం గ్రామాలను బిషప్ ఉదయం నుండి రాత్రి దాకా పర్యటించారు.ప్రతి గ్రామంలోనూ బిషప్ కు మేళ తాళాలు తపాకాయలు కాలుస్తూ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.తర్వాత సంఘ విశ్వాసులతో బిషప్ సమావేశమై వారితో మాట్లాడారు.సంఘాల స్థితిగతుల గురించి సంఘాల బలో పేతం మరియు దేవుని పట్ల విశ్వాసం పెంపొందితే సంఘాలు ఇంకా బలపడతాయని మనం అనుకున్న తలంపులు దేవుడు నెరవేరుస్తారని అన్నారు.ఈ విచారణ దేవాలయంలో గ్రామాలకు కలిపి యువతకు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా దేవాలయాలు దెబ్బతిన్న గ్రామాల్లో నూతన దేవాలయాల నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానని బిషప్ అన్నారు.49 బన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సిలువను బిషప్ ప్రతిష్టించి ప్రారంభించారు.    అనంతరం బిషప్ జ్వాన్నేష్ ను గురువులను శాలువా పూలమాలలతో సంఘస్తులు పెద్దలు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు బిషప్ హౌస్ సెక్రటరీ ఫాదర్ ప్రవీణ్, ఉప్పలదడియ విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు,బ్రదర్ థోమాస్, ఆనిమేటర్ చిన్నప్ప,విచారణ పెద్దలు ఆనందరావు, పక్కిరయ్య,ఏసన్న,సామన్న,జాన్,సిద్దయ్య,డేవిడ్,బాబు, ప్రసాద్ మరియు మరియదళం సభ్యులు పాల్గొన్నారు.

About Author