సీనియర్ న్యాయవాది సేపూరి విజయమోహన్ చోరువ తో బాలుడు సురక్షితం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగర్ ముజాఫ్ నగర్ కు చెందిన రామకృష్ణ యాదవ్ దంపతులకు నలుగురు సంతానం ఇందులో చిన్న కుమారుడైన కొండయ్య యాదవ్ కు బసాపురం చెందిన హరితతో వివాహం జరిపించారు. అనంతరం 9 సంవత్సరాల తర్వాత ఆ దంపతులకు ఒక కుమారుడు హర్షవర్ధన్ జన్మించారు. అనుమానాస్పదంతో కొండయ్య యాదవ్ మృతి చెందడం తో హరిత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. జేజీ జేజినాన్న సంరక్షణలో ఉన్న హర్షవర్ధన్ ను హరిత నాకు అప్పగించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించింది. సీనియర్ న్యాయవాది సేపూరి విజయమోహన్ చొరవతో సి డబ్ల్యూ సి బెంచ్ ముందు వాదించి కుమారుడు హర్షవర్ధన్ జేజి జేజి నాన్న దగ్గరే ఉండేందుకు సిడబ్ల్యూసి తీర్పు ఇచ్చింది. కుమారుడు హర్షవర్ధన్ జేజి జేజి నాన్న దగ్గరే ఉండేందుకు అంగీకరించాడు. రామకృష్ణ దంపతులు సీనియర్ న్యాయవాది సేపూరి విజయ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు.