PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈక్విటీ షేర్ల కేటాయింపుకు ఆమోదం తెలిపిన పీసీ జువెలర్స్పీసీ జువెలర్స్

1 min read

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: పీసీ జువెలర్స్ లిమిటెడ్‌ (బిఎస్ఈ: 534809, ఎన్‌ఎస్‌ఈ: పీసీజెవెలర్) బోర్డు వారెంట్ల మార్పిడి ద్వారా ఈక్విటీ షేర్లను కేటాయించడాన్ని ఆమోదించింది. 3,38,85,000 షేర్లను 35 మంది ‘నాన్-ప్రొమోటర్, పబ్లిక్ కేటగిరీ’కి చెందిన వ్యక్తులకు కేటాయించింది, వీరంతా తమ వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసుకున్నారు. ఈ మార్పిడి కోసం ఒక్కో షేరుకు రూ.42.15 చొప్పున మొత్తం రూ. 142.82 కోట్ల మేర మొత్తాన్ని అందించారు.2024 సెప్టెంబర్ 30తో ముగిసిన అర్ధసంవత్సరంలో కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వినియోగదారుల డిమాండ్, స్టోర్ సందర్శనలు పెరగడంతో కంపెనీ ఆదాయం, లాభాలు గణనీయంగా వృద్ధి చెందాయి. క్యూ2ఎఫ్ వై25లో కంపెనీ ఆదాయం రూ. 505 కోట్లకు చేరుకుంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1430% పెరుగుదల. ఇబిఐటిడిఏ రూ. 129 కోట్లు కాగా, పన్ను ముందలి లాభం రూ. 124 కోట్లు నమోదైంది. హెచ్1ఎఫ్ వై 25లో ఆదాయం 797% వృద్ధితో రూ. 906 కోట్లకు చేరుకుంది. ఇబిఐటిడిఏ రూ. 218 కోట్లు, పన్ను ముందలి లాభం రూ. 207 కోట్లు.ఈ అర్థ సంవత్సరంలో కంపెనీ, బ్యాంకులతో తన ఒప్పందాలు సవ్యంగా పరిష్కరించుకోవడానికి ముందడుగు వేసింది. 14 బ్యాంకుల కన్సార్టియంతో సెప్టెంబర్ 30న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పీసీ జువెలర్స్ తన లెండర్లకు చెల్లింపులు చేయడం ప్రారంభించింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు వారెంట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ నిధులు సమకూర్చినట్లు కంపెనీ ప్రకటించింది.ఈ అన్ని సానుకూల పరిణామాల వలన, పీసీ జువెలర్స్ తన అభివృద్ధి, లాభాల దిశగా మరింత నిబద్ధతతో ముందుకు సాగుతోంది.

About Author