క్రీడల దుస్తులను ఆవిష్కరించిన ఎంపీ శబరి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగే ఆటల పోటీల్లో విద్యార్థులు విజయ దుందుభీ మోగించాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యార్థులకు సూచించారు. ఈ నెల 12 నుండి 16 వరకు జరిగే అండర్-14 బాల బాలికల ఫెన్సింగ్ జాతీయ క్రీడల్లో పాల్గొనే జట్టు యొక్క క్రీడల దుస్తులను గురువారం నంద్యాలలో ఎంపీ కార్యాలయంలో ఎంపీ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు.నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనాథ్ నంద్యాల ఎంపీ ని వారి కార్యాలయంలో కలిసి జాతీయ క్రీడల యొక్క షెడ్యుల్ ను,ఎంపికైన క్రీడాకారుల వివరాలను వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆటల పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అండర్-14 బాల బాలికల ఫెన్సింగ్ జట్టు జమ్మూ కాశ్మీర్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలతో తిరిగి రావాలని ఎంపీ ఆకాంక్షించారు.అనంతరం జట్టు కోచ్,మేనేజర్లు గా వ్యవహరిస్తున్న ముస్తహీర్,వెంకటేశ్వర్లు ను ఎంపీ అభినందించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లన్న పాల్గొన్నారు.