PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలి 

1 min read

నంద్యాలలో న్యాయశాఖ మంత్రి ఫరూక్ ను కలిసిన న్యాయవాదులు 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : కర్నూలు జిల్లాలో వెనుకబడిన పత్తికొండ పట్టణంలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని  పత్తికొండ న్యాయవాదులు కోరారు. గురువారం నంద్యాలలో న్యాయశాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ మరియు పత్తికొండ న్యాయవాదులు కలిశారు. పత్తికొండ డివిజన్ హెడ్ క్వార్టర్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే ద్వారా న్యాయవాదులు వినతిపత్రం అందించారు. పత్తికొండ డివిజన్ ఏర్పడి ఐదు సంవత్సరాలు కావస్తున్నా పత్తికొండలో అప్పటి వైసిపి ప్రభుత్వం సబ్ కోర్టు ఏర్పాటు చేయలేదని న్యాయవాదులు ఎమ్మెల్యే కెఈ.శ్యామ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ ఈరోజు న్యాయశాఖ మంత్రి ఫరూక్ని  కలిసి పత్తికొండ డివిజన్ హెడ్క్వార్టర్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దానికి  న్యాయశాఖ మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రంగస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్ అసోసియేషన్ సభ్యులు, శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, న్యాయవాదులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *