ట్రాన్స్ జెండర్లకు పెటీ టైటిస్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
1 min readవ్యాక్సిన్ సేవలను అందుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
డాక్టర్ నాగేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో బుధవారం ట్రాన్స్ జెండర్లకు స్థానికి ఏ ఆర్ టి కేంద్రము,జి.జి.హెచ్ లో హెపిటైటిస్ బి మరియు సి పరీక్షలు నిర్వహించి వారికి వ్యాక్సిన్ వేయడము జరిగిందని,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా డా:నాగేశ్వర రావు, జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి. బి అధికారి పాల్గొని ట్రాన్స్ జెండర్లకు హెపిటైటిస్ వ్యాధి పై అవగాహన కల్పించి, ప్రభుత్వము అందిచే ఉచిత అందించే హెపిటైటిస్ బి,సి పరీక్షలు మరియు వ్యాక్సిన్ సేవలను అందుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో పి.బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, ఏ. హరినాధరావ్, జిల్లా సూపర్వైసర్,శిరీష, ప్రాజెక్టు మేనేజర్ మరియు ఏ.ఆర్.టి సిబ్బంది పాల్గొన్నారు.