పత్తికొండ సమగ్ర అభివృద్ధి కోసం నిధులు తీసుకు రావాలని ఎమ్మెల్యేకి బహిరంగ లేఖ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ సమస్యల మీద రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గళం వినిపించి సమస్యల పరిష్కారం కోసం తగినన్ని నిధులు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ను కాంగ్రెస్ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి క్రాంతి నాయుడు కోరారు. పూర్తిగా వెనుకబడిన పత్తికొండ ప్రాంత సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ, కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి క్రాంతి నాయుడు స్థానిక ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ కు గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి మరియు సాధికారత కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కి పత్తికొండ యువత మరియు పత్తికొండ నియోజకవర్గ ప్రజల తరుపున పత్తికొండ కాంగ్రెస్ కమిటీ ద్వారా లేఖ వ్రాయడం జరిగిందని ఆయన విలేకరులకు తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన యువత కోసం ఉచిత డీఎస్సీ కోచింగ్, బాలికల, బాలుర వసతి గృహాలు, అన్న క్యాంటీన్, త్రాగునీటి సమస్య, తుగ్గలి మండలంలో మోడల్ స్కూల్, లక్కసాగరం లో హై స్కూల్, పత్తికొండ లో వాల్మీకి భవన్, డాక్టర్ల కొరత పైన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే దీర్ఘకాలికంగా ఈ ప్రాంతంలో వలసల నివారణ కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తీరణ మరియు నిర్మాణాలు, చెరువులను పిల్ల కాలువలు ద్వారా నింపడం, ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, నియోజకవర్గానికి కార్పస్ నిధులు వచ్చేలా చూడాలన్నారు.