రాయలసీమ విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి , ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాథ్ , రాయలసీమ విశ్వవిద్యాలయ విసి. ఎన్టికే నాయక్, రిజిస్ట్రార్ విజయ్ కుమార్ నాయుడు, నవంబర్ 9Vన జాతీయ న్యాయ సేవ దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు అనగా 08.11.2024 న రాయలసీమ విశ్వవిద్యాలయ నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రత్యేకత ను, సైబర్ చట్టాలు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి విద్యార్థులకు వివరించారు.