జన వాసల మధ్య వైన్స్ షాప్ తొలగించండి
1 min readదేవాలయం పక్కనే అనుమతి ఇచ్చిన అధికారులు,
ప్రజలు, భక్తుల ఇబ్బందులు పట్టించుకోని ఎక్సయింజ్ పోలీసులు,
ప్రధాన రోడ్డు పై మద్యం షాపుకు అధికారుల అనుమతి పై కార్మిక సంఘాల ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన పోలీసులు, మద్యం దుకాణదారులతో కుమ్మకై గుడి, బడి అనే తేడా లేకుండ తమ స్వార్థం కోసం గుడి పక్కనే మద్యం దుకాణనికి అనుమతి ఇవ్వడం పై పలు కార్మిక సంఘం నాయకులు మండ్డి పడ్డారు.హొళగుంద లోని మురళి రైస్ మిల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పై వైన్స్ షాప్ కు ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇవ్వడం పై సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్,సిఐటీయూ మండల అధ్యక్షుడు నాగరాజు, దళిత సమాఖ్య మండల అధ్యక్షుడు నల్ల మల్లేష్ మండ్డి పడ్డారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు మాట్లాడుతూ సిద్దేశ్వర స్వామి దేవాలయం , జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లే దారిలో వైన్స్ షాపు కు అనుమతులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ముందు నుండి జడ్పీ ఉన్నత పాఠశాల, రాయల్ రిఫా పాఠశాలలకు వేల సంఖ్యలో విద్యార్ధి, విద్యార్థినిలు రాక పోకలు సాగిస్తుంటారని, అలాగే మద్యం దుకాణానికి సమీపంలో లక్ష్మి దేవాలయం ఉండడంతో నిత్యం మహిళలు, ఈ దారి గుండానే వెళ్లి దేవాలయం లొ పూజలు,వ్రతాలు చేస్తుంటారని , అలాంటి వారి పై మందు బాబులు మద్యం సేవించి మహిళలపై, విద్యార్థులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ప్రజలు తిరిగే చోట అధికారులు మద్యం దుకాణానికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు మద్యం దుకాణం తొలగించక పొతే కార్మిక,విద్యార్ధి, ప్రజా సంఘాలతో ధర్నాలు చెప్పాడతమని హెచ్చరించారు. ఈ విషయం పై ఆలూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ లలితను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చామని, పాఠశాలకు 100 మీటర్ల దూరం గా ఉన్నాయని తెలిపారు.