సి.ఎస్.సిలో కోర్టు కేసులపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సి.ఎస్.సిలో కోర్టు కేసులపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కమిషనర్ శ్రీ వి.విజయరామరాజు , డైరెక్టర్ శ్రీమతి పార్వతి మేడం, సి మ్యాట్ డైరెక్టర్ శ్రీ వి.ఎన్.మస్తానయ్య , డీజీఇ శ్రీ కెవి శ్రీనివాసులు రెడ్డి , డిప్యూటీ డైరెక్టర్లు శ్రీ ఎస్ అబ్రహం , శ్రీమతి పి.శైలజ , ఆప్తా సంఘ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎస్ నారాయణ రావు, సోదర సంఘాల బాధ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు. పండిత పదోన్నతులపై కొనసాగుతున్న కేసులపై చర్చించడం జరిగింది.నియామకాలకు, పదోన్నతులకు ఒకే విధమైన విద్యార్హతలు నిర్ణయించాలని కోరగా అంగీకరించారు. ఈ విషయంలో NCTE నిబంధనలు అమలు చేయాలని కోరడం జరిగింది.జీవో 117 రద్దు, అనంతరం అమలు చేయవలసిన విధానంపై చర్చించడం జరిగింది. గత సమావేశంలో ఈ అంశంపై సంఘాల పక్షాన చేసిన ప్రతిపాదనలు ఆధారంగా 2 వారాల్లో ముసాయిదా ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి తరగతికి ఉపాధ్యాయుని నియమిస్తామన్నారు. 6 7 8 తరగతులలో 60 మంది పైగా విద్యార్థులు గల ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తామన్నారు.ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఆయా జిల్లాలలో నిర్వహించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.రాబోయే విద్యా సంవత్సరం నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేస్తామన్నారు. శిక్షణా కార్యక్రమాలు ఏవైనా శనివారం మాత్రమే నిర్వహిస్తామన్నారు.బదిలీల కొరకు నిర్ణయించిన నాలుగు కేటగిరీలలో ఏ పాఠశాల ఏ కేటగిరీ కింద పరిగణిస్తారో ముందుగానే జాబితా విడుదల చేస్తామని తెలిపారు.బదిలీలు పదోన్నతులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు, నిబంధనలు, సీనియారిటీ జాబితాలు రెండు మూడు నెలల్లో తుది రూపుకు తెస్తామన్నారు.వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రేషనలైజేషన్,బదిలీలు, పదోన్నతులు, డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామన్నారు.పని సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంకా ఎక్కడైనా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే ఈనెల 10 – 12 తేదీలోగా వివరాలు తెప్పించుకుని సర్దుబాటు చేస్తామన్నారు.పురపాలక పదోన్నతులు, నియామకాల 70: 30 కోటా అమలు సమస్యపై చర్చించడం జరిగింది.కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల కొరతపై మంత్రిగారితో చర్చించామని, ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు.పని సర్దుబాటు ప్రక్రియలో జిల్లాల నుండి వచ్చిన గ్రీవెన్స్ పై డైరెక్టర్ పార్వతి మేడం తో చర్చించి పరిష్కరించుకోమని తెలిపారు.రాబోయే డీఎస్సీలో కోర్టు సమస్యలు ఎదురుకాకుండా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.APAAR ప్రక్రియ నమోదులో క్రింది స్థాయిలో అధికారులు తీసుకువస్తున్న ఒత్తిడిని తెలిపి, ఒత్తిడి లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా క్రింది స్థాయి అధికారులకు సూచనలు చేయాలని కోరడం జరిగింది.అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఆగిపోయిన పదోన్నతులపై చర్చించడం జరిగింది.సర్వీస్ పరమైన సమస్యలు, కడప నగరపాలక పరిధిలో ముగ్గురు ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్, జేఎల్ పదోన్నతుల సమస్య, పురపాలక పండిత పదోన్నతుల అర్హతలు, 610 జీవో పరిధిలో కోర్టు ద్వారా కొనసాగుతున్న ఉపాధ్యాయుల సమస్య, ఏకీకృత సర్వీస్ నిబంధనలపై కోర్టు కేసులు తదితర అంశాలపై సంఘ పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరిగింది.అలాగే గుర్తింపు పొందిన సంఘాల పక్షాన రెసిడెన్షియల్ శిక్షణా తరగతులను రద్దు చేయాలని, శిక్షణ ఇవ్వాల్సి వస్తే నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.ఎ జి ఎస్ గణపతి రావు రాష్ట్ర అధ్యక్షుడు కె. ప్రకాశ్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.నారాయణ రావు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్.